Sericulture farmer · Korinthakunta Thanda, Telanganaపట్టు రైతు · కోరింతకుంట తండా, తెలంగాణ

Mudavath Shakru Nayakమూడావత్ శక్రు నాయక్

From a failed job search to India’s National Best Sericulture Farmer.ఉద్యోగం దొరకని యువకుడి నుంచి దేశంలోనే ఉత్తమ పట్టు రైతు వరకు.

🏆 National Best Sericulture Farmer · Central Silk Board, 2025జాతీయ ఉత్తమ పట్టు రైతు · కేంద్ర పట్టు బోర్డు, 2025
Scroll
His storyఆయన కథ

He held on — and won.పట్టుబట్టి గెలిచాడు.

A young farmer who trusted his own land, took a risk nobody around him believed in, and turned a small thanda into a model for all of Telangana.తన భూమిని నమ్ముకుని, ఎవరూ నమ్మని సాహసం చేసి, ఒక చిన్న తండాను తెలంగాణకే ఆదర్శంగా మార్చిన యువ రైతు.

01Shakru Nayak standing in his mulberry garden
Rootsమూలాలు

A farmer’s son with a dream of a government jobప్రభుత్వ ఉద్యోగం కలగన్న రైతు బిడ్డ

Shakru grew up in Korinthakunta Thanda in Talakondapally mandal, Rangareddy district, where his parents farmed paddy. After finishing his degree he tried for a government job, twice, and missed both times.

He took a job as an assistant manager at a private company in Hyderabad. But every Sunday he was back in the village, working the fields beside his parents. Farming had been his love since childhood.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాలో పుట్టిన శక్రు తల్లిదండ్రులు వరి సాగు చేసే రైతులు. డిగ్రీ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. అయినా ప్రతి ఆదివారం ఊరికి వచ్చి అమ్మానాన్నలతో కలిసి పొలం పనులు చేసేవారు. చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే ఆయనకు ఇష్టం.

02Shakru Nayak checking silkworms in the rearing shed
The riskసాహసం

“Why take on this hardship?”“ఈ కష్టం ఎందుకు బిడ్డా?”

A friend told him about silkworm rearing. Shakru met the local sericulture officer, and after that meeting his mind was made up. He left his job and told his family he would start sericulture on two acres of their land.

His father pushed back. The village watched with doubt, warning he would drown in debt with a crop no one had grown before. He borrowed about ₹10 lakh to build his rearing shed. With no experience, his first two crops made losses — and he still didn’t turn back.

ఒక స్నేహితుడు పట్టు పురుగుల పెంపకం గురించి చెప్పాడు. స్థానిక సెరికల్చర్ అధికారిని కలిసిన తర్వాత శక్రు నిర్ణయం తీసుకున్నారు — ఉద్యోగం వదిలేసి, రెండు ఎకరాల్లో పట్టు సాగు చేస్తానని ఇంట్లో చెప్పారు.

“చక్కగా ఉద్యోగం చేసుకోక ఈ కష్టం ఎందుకు బిడ్డా!” అన్నారు నాన్న. ఊర్లో వాళ్లు అప్పులపాలవుతావని హెచ్చరించారు. సుమారు రూ.10 లక్షలు అప్పు చేసి షెడ్ నిర్మించారు. అనుభవం లేక మొదటి రెండు పంటల్లో నష్టం వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు.

03A heap of freshly harvested white silk cocoons
The turnమలుపు

Crop after crop, the silk started to payపంట పంటకూ లాభాల బాట

He started in 2018. Covid slowed things down, but by following the sericulture officers’ advice closely, the profits began to come. Today a crop takes about 21 days, and he harvests up to 12 crops a year — enough to clear every loan he took.

The same people who once laughed came to him asking how. Young farmers from his thanda built their own sheds, and Talakondapally mandal became the No. 1 silk-producing mandal in Telangana.

2018లో మొదలైన పట్టు సాగు కరోనా సమయంలో కాస్త నెమ్మదించింది. అధికారుల సూచనలు పాటిస్తూ లాభాల బాట పట్టారు. ఇప్పుడు సుమారు 21 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 12 పంటల వరకు తీస్తున్నారు. తెచ్చిన అప్పులన్నీ తీర్చేశారు.

మొదట నవ్విన వాళ్లే ఆయన దగ్గరకు వచ్చి సాగు పద్ధతులు అడిగారు. తండాలోని యువ రైతులు సొంతంగా షెడ్లు నిర్మించుకున్నారు. పట్టు ఉత్పత్తిలో తలకొండపల్లి మండలం రాష్ట్రంలోనే మొదటి స్థానానికి చేరింది.

04College students visiting Shakru Nayak's sericulture farm
Giving backసమాజానికి

A farm that became a classroomపాఠశాలగా మారిన పొలం

Farmers, scientists and students now come to Korinthakunta from across Telangana and beyond. A Sericulture Resource Centre was set up in his village, and as president of the Rangareddy district sericulture farmers’ association, he trains new farmers every month.

“When they tell me, ‘Because of you we grow silk and live without debt’ — that feeling is worth more than anything,” he says.

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు కోరింతకుంటకు వస్తున్నారు. ఆయన గ్రామంలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటైంది. జిల్లా పట్టు రైతుల సంఘం అధ్యక్షుడిగా ప్రతి నెలా కొత్త రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

“నీ వల్లనే పట్టుసాగు చేస్తూ అప్పులు లేకుండా ఆనందంగా బతుకుతున్నాం అని వాళ్లు అన్నప్పుడు ఈ జన్మకు ఇంకేం కావాలి అనిపిస్తుంది” అంటారు శక్రు.

“Rather than holding out a hand to someone for a job, I believe we should live by working our own land, the way we love.”

“ఉద్యోగాల కోసం ఒకరి దగ్గర చేయి చాచడం కన్నా.. మన భూమిలో మనకు నచ్చి పనిచేసుకుంటూ జీవించాలనేది నా అభిప్రాయం.”

— Mudavath Shakru Nayak · Namaste Telangana, June 2025నమస్తే తెలంగాణ, జూన్ 2025
By the numbersఅంకెల్లో

What one decision grew intoఒక్క నిర్ణయం ఎంత ఎదిగిందో

12
Silk crops a year, at bestఏడాదికి గరిష్ఠంగా పంటలు
21
Days from worm to cocoonఒక్కో పంటకు రోజులు
51
Young farmers who built their own shedsసొంత షెడ్లు నిర్మించుకున్న యువ రైతులు
86,000 kg
Silk a year from Talakondapally mandalతలకొండపల్లి మండలం ఏటా పట్టు ఉత్పత్తి
200+
Farmers turning to mulberryమల్బరీ సాగు వైపు రైతులు
No. 1
Silk mandal in Telanganaరాష్ట్రంలో పట్టు ఉత్పత్తిలో స్థానం

Figures as reported by Eenadu, Disha and Namaste Telangana, 2025.ఈనాడు, దిశ, నమస్తే తెలంగాణ (2025) కథనాల ఆధారంగా.

For farmersరైతుల కోసం

How silk is made on his farmఆయన పొలంలో పట్టు తయారీ ఇలా

Low water, low cost, and income all year round — the model that farmers across Telangana now come to learn.తక్కువ నీరు, తక్కువ ఖర్చు, ఏడాది పొడవునా ఆదాయం — ఇప్పుడు రాష్ట్రమంతటి రైతులు నేర్చుకోవడానికి వస్తున్న పద్ధతి.

Mulberry garden

Mulberry gardenమల్బరీ తోట

Mulberry is planted once and harvested again and again. It is the only food silkworms eat.ఒకసారి నాటితే మళ్లీ మళ్లీ కోతకు వచ్చే మల్బరీ ఆకులే పట్టు పురుగులకు ఆహారం.

Rearing shed

Rearingపెంపకం

Young worms are raised on racks in a shed and fed fresh leaves several times a day.షెడ్డులో రాక్‌లపై పురుగులను ఉంచి రోజుకు పలుమార్లు తాజా ఆకులు వేస్తారు.

Silkworms spinning

Spinningగూడు కట్టడం

In the last days the worms are moved to spinning frames, where they spin their cocoons.చివరి రోజుల్లో పురుగులను చంద్రికల్లోకి మార్చితే అవి పట్టు గూళ్లు అల్లుతాయి.

Harvested cocoons

Harvest & saleదిగుబడి, అమ్మకం

Cocoons are collected and sold at the market — a new crop about every 21 days.గూళ్లను సేకరించి మార్కెట్లో అమ్ముతారు — సుమారు ప్రతి 21 రోజులకు ఒక పంట.

Less waterతక్కువ నీరుMulberry needs far less water than paddy.వరి కన్నా మల్బరీకి చాలా తక్కువ నీరు చాలు.
Steady incomeస్థిర ఆదాయంA harvest almost every month, not once a season.సీజన్‌కు ఒకసారి కాదు, దాదాపు ప్రతి నెలా ఆదాయం.
Government supportప్రభుత్వ సహాయంSubsidies are available for building rearing sheds. Ask the district sericulture office.షెడ్ నిర్మాణానికి సబ్సిడీ లభిస్తుంది. జిల్లా పట్టు పరిశ్రమ కార్యాలయాన్ని సంప్రదించండి.
Journeyప్రయాణం

Milestonesమైలురాళ్లు

Early yearsతొలి రోజులు

Degree, job hunt, city jobడిగ్రీ, ఉద్యోగ ప్రయత్నాలు

Two attempts at a government job, then an assistant manager’s post in Hyderabad.ప్రభుత్వ ఉద్యోగానికి రెండు ప్రయత్నాలు, తర్వాత హైదరాబాద్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం.

2018

Starts sericulture on 2 acres2 ఎకరాల్లో పట్టు సాగు ప్రారంభం

Quits his job and borrows about ₹10 lakh for a rearing shed. The first two crops make losses.ఉద్యోగం వదిలి సుమారు రూ.10 లక్షల అప్పుతో షెడ్ నిర్మాణం. మొదటి రెండు పంటల్లో నష్టం.

Jan 2023

First big press featureతొలి ప్రధాన పత్రికా కథనం

Eenadu: “పట్టుదలకు నిదర్శనం” — a 25-day crop earning about ₹1 lakh.ఈనాడు: “పట్టుదలకు నిదర్శనం” — 25 రోజుల పంటకు రూ.లక్ష ఆదాయం.

Dec 2024

Resham Krishi Mela, Chitradurgaరేషమ్ కృషి మేళా, చిత్రదుర్గ

Recognised on stage at the Ministry of Textiles’ silk farmers’ fair.కేంద్ర జౌళి శాఖ పట్టు రైతుల మేళాలో వేదికపై గౌరవం.

May 2025

Talakondapally becomes No. 1రాష్ట్రంలో తలకొండపల్లి నంబర్ వన్

The mandal leads Telangana in silk; farmers from other districts start visiting.పట్టు ఉత్పత్తిలో మండలం రాష్ట్రంలో ప్రథమం; ఇతర జిల్లాల రైతుల సందర్శనలు.

Jun 2025

Resource Centre & cover storyరిసోర్స్ సెంటర్, ముఖచిత్ర కథనం

A Sericulture Resource Centre is sanctioned for the thanda; Namaste Telangana runs his story, “పట్టుబట్టి గెలిచాడు”.తండాకు సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ మంజూరు; నమస్తే తెలంగాణలో “పట్టుబట్టి గెలిచాడు” కథనం.

Jul–Aug 2025

State leaders visitప్రముఖుల సందర్శన

Former Deputy CM Mahmood Ali and Director of Horticulture & Sericulture Shaik Yasmeen Basha IAS visit and call the thanda a role model.మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఉద్యాన–పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ సందర్శించి తండాను రోల్ మోడల్‌గా ప్రశంసించారు.

20 Sep 2025

National Best Sericulture Farmerజాతీయ ఉత్తమ పట్టు రైతు

Honoured at the Central Silk Board’s 76th Foundation Day, GKVK Bengaluru, chosen among farmers from 20 states — and named India’s first “Motivator” in sericulture.బెంగళూరు జీకేవీకేలో కేంద్ర పట్టు బోర్డు 76వ వ్యవస్థాపక దినోత్సవంలో 20 రాష్ట్రాల రైతుల్లో ఎంపికై పురస్కారం — దేశంలోనే మొదటి మోటివేటర్‌గా ఎంపిక.

Nov 2025

Teaching the scientistsశాస్త్రవేత్తలకు పాఠాలు

Chief guest at an induction for 125 newly recruited Central Silk Board scientists in Hyderabad.హైదరాబాద్‌లో కొత్తగా ఎంపికైన 125 మంది సీఎస్‌బీ శాస్త్రవేత్తల శిక్షణలో ముఖ్య అతిథి.

Dec 2025 – 2026

Training the next generationకొత్త తరానికి శిక్షణ

Training programmes for Karimnagar farmers, and regular visits by college and school students to the Resource Centre.కరీంనగర్ రైతులకు శిక్షణ, రిసోర్స్ సెంటర్‌కు కళాశాల, పాఠశాల విద్యార్థుల సందర్శనలు.

Awards & honoursపురస్కారాలు

Recognised by the nationదేశం గుర్తించిన కృషి

Shakru Nayak receiving the national award from Central Silk Board
2025 · Central Silk Board, Ministry of Textilesకేంద్ర పట్టు బోర్డు, జౌళి మంత్రిత్వ శాఖ

National Best Sericulture Farmerజాతీయ ఉత్తమ పట్టు రైతు పురస్కారం

Received at the 76th Foundation Day celebrations, GKVK campus, Bengaluru, on 20 September 2025.2025 సెప్టెంబర్ 20న బెంగళూరు జీకేవీకే క్యాంపస్‌లో 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో అందుకున్నారు.

2025

India’s first “Motivator” in sericultureదేశంలో మొదటి మోటివేటర్

Selected as the country’s first motivator for silk farming.పట్టు పరిశ్రమలో దేశంలోనే మొదటి మోటివేటర్‌గా ఎంపిక.

Stateరాష్ట్రం

Best Young Farmer awardఉత్తమ యువ రైతు అవార్డు

Honoured as a best young farmer in sericulture.పట్టు సాగులో ఉత్తమ యువ రైతుగా పురస్కారం.

2025

Appreciation Award, Resham Krishi Melaరేషమ్ కృషి మేళా ప్రశంసా పురస్కారం

From the Central Silk Board and Telangana’s Department of Horticulture & Sericulture.కేంద్ర పట్టు బోర్డు, తెలంగాణ ఉద్యాన–పట్టు పరిశ్రమ శాఖ నుంచి.

Sep 2025

Felicitated by the Directorడైరెక్టర్ సన్మానం

Honoured by Director of Horticulture & Sericulture Shaik Yasmeen Basha IAS.ఉద్యాన–పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ సన్మానం.

Impactప్రభావం

One farmer, a whole thandaఒక్క రైతు, తండా మొత్తం

Sericulture Resource Centre building

Sericulture Resource Centreసెరికల్చర్ రిసోర్స్ సెంటర్

A Central Silk Board resource centre in Korinthakunta, where Shakru guides farmers and students.కోరింతకుంటలో కేంద్ర పట్టు బోర్డు రిసోర్స్ సెంటర్ — ఇక్కడ రైతులకు, విద్యార్థులకు శక్రు మార్గదర్శనం.

Farmers touring mulberry garden

Farmers’ association presidentరైతుల సంఘం అధ్యక్షుడు

Leads the Rangareddy district sericulture farmers’ association and speaks up for their needs, like drip irrigation.రంగారెడ్డి జిల్లా పట్టు రైతుల సంఘానికి అధ్యక్షుడిగా డ్రిప్ వంటి అవసరాల కోసం కృషి.

Students learning on the farm

A living classroomప్రత్యక్ష పాఠశాల

Monthly awareness sessions for 10–15 farmers, plus visits from agriculture colleges and schools.నెలకు 10–15 మంది రైతులకు అవగాహన; వ్యవసాయ కళాశాలలు, పాఠశాలల సందర్శనలు.

Farmers from Khammam, Warangal, Mahabubabad, Karimnagar, Nagarkurnoolఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, నాగర్‌కర్నూల్ రైతులు Officials from Karnataka, Tamil Nadu, Maharashtraకర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అధికారులు 125 Central Silk Board scientists125 మంది సీఎస్‌బీ శాస్త్రవేత్తలు Agriculture & horticulture college studentsవ్యవసాయ, ఉద్యాన కళాశాల విద్యార్థులు
In the newsవార్తల్లో

What the newspapers wroteపత్రికలు రాసిన కథనాలు

Tap any clipping to read it full size.పూర్తిగా చదవడానికి క్లిప్పింగ్‌పై నొక్కండి.

Videosవీడియోలు

See the farm in actionపొలంలో పని ఇలా

Feeding the silkwormsపురుగులకు ఆకులు వేయడం

Shakru shows how fresh mulberry is spread on the rearing beds.రాక్‌లపై మల్బరీ ఆకులు ఎలా వేస్తారో చూపిస్తున్న శక్రు.

A national dignitary’s visitప్రముఖుల పర్యటన

Leaders meet farmers at the farm.పొలం వద్ద రైతులతో ముఖాముఖి.

Celebration at the Resource Centreరిసోర్స్ సెంటర్ వద్ద సంబరం

Farmers and officials at the Sericulture Resource Centre.సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ వద్ద రైతులు, అధికారులు.

On televisionటీవీ కథనాలు

Visit & contactసందర్శన, సంప్రదింపు

Come see the farmపొలాన్ని చూడండి

Farmers, students and officials who want to learn sericulture are welcome. Please call before visiting.పట్టు సాగు నేర్చుకోవాలనుకునే రైతులు, విద్యార్థులు, అధికారులకు స్వాగతం. రావడానికి ముందు ఫోన్ చేయండి.

Phoneఫోన్+91 98485 95269
Emailఈమెయిల్akkiramshakru@gmail.com
FarmచిరునామాSericulture Resource Centre, Korinthakunta Thanda, Talakondapally Mandal, Rangareddy District, Telanganaసెరికల్చర్ రిసోర్స్ సెంటర్, కోరింతకుంట తండా, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ